సమస్య తీవ్రమైనదే.. అయినా పూర్తిగా కోలుకున్నా: దలైలామా

  • ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడ్డ దలైలామా
  • ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • ధర్మశాలకు తిరిగిచ్చిన బౌద్ధ మత గురువు
బౌద్ధ మత గురువు దలైలామా ధర్మశాలకు తిరిగొచ్చారు. ఛాతీ ఇన్ఫెక్షన్ కు సంబంధించి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందిన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న తర్వాత ఢిల్లీ నుంచి ధర్మశాలకు ఆయన తిరిగొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, 'అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నా. ఎలాంటి సమస్య లేదు. సమస్య తీవ్రమైనదే అయినప్పటికీ... సంపూర్ణంగా కోలుకున్నా' అని తెలిపారు.

ఏప్రిల్ 7న చికిత్స నిమిత్తం దలైలామాను ఢిల్లీకి తీసుకొచ్చారు. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. చైనాకు వ్యతిరేకంగా పోరాడుతూ 1959లో టిబెట్ నుంచి ఇండియాకు వచ్చిన దలైలామా... అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆయన ఎక్కువగా గడుపుతారు.
Go Back to Shorts
dalai lama
ill
dharmashala

More Telugu News